1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Karnataka Assembly Polls: Congress Will Win More Seats Than 2013, BJP To Come Second, Predicts Survey

బీజేపీని చిత్తుగా ఓడించనున్న తెలుగు ప్రజలు.. హస్తానికి జై... ఎక్కడ?

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకునేందుకు తెలుగు ప్రజలు కసితో రగిలిపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఏ ఇద్దరు తెలుగువారు తారసపడితే వారిమధ్య మోడీ

Karnataka Assembly Polls
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకునేందుకు తెలుగు ప్రజలు కసితో రగిలిపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఏ ఇద్దరు తెలుగువారు తారసపడితే వారిమధ్య మోడీ మోసమే చర్చకు వస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం కంటే.. ఇపుడు బీజేపీ చేసిన నమ్మకద్రోహాన్ని ఏ ఒక్క తెలుగోడు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలన్న కృతనిశ్చయంతో తెలుగు ప్రజలు ఉన్నట్టు సమాచారం. 
 
మరో రెండు మూడు రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నేపథ్యంలో  సీఫోర్‌ సర్వే ప్రీపోల్‌ ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వేలో కన్నడిగులు మరోసారి కాంగ్రెస్‌కే జైకొట్టనున్నట్టు తేల్చారు. ప్రభుత్వ వ్యతిరేకతను తోసిరాజని ఏకంగా 9 శాతం ఓటింగ్‌ పెరుగుతుందని ఈ సర్వే తేల్చింది. అదేసమయంలో బీజేపీకి నిరాశే ఎదురు కానుందని స్పష్టం చేసింది. ఈ సర్వే ఫలితాలపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
 
మొత్తం 225 అసెంబ్లీ సీట్లు కలిగిన కర్ణాటక అసెంబ్లీలో 154 నియోజకవర్గాల్లో మార్చి 1 నుంచి 25 వరకు ఈ ప్రీపోల్‌ సర్వే నిర్వహించారు. ఇందుకోసం 2,368 పోలింగ్‌ బూత్‌లలో 22,357 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఓ ఓటర్లు వెల్లడించిన అభిప్రాయం మేరకు కాంగ్రెస్‌కు ఓట్ల శాతం 46కు పెరగనుంది. అలాగే, బీజేపీ 31 శాతం, జేడీఎస్‌ 16 శాతం చొప్పున ఓట్లు పోలుకానున్నాయట. అంటే కాంగ్రెస్‌కు 112 నుంచి 126 సీట్లు, బీజేపీకి 70 సీట్లు, జేడీఎస్‌కు 27 సీట్లు వస్తాయని సీఫోర్ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా, తెలుగు ప్రజలు అధికంగా ఉండే బెంగుళూరు, బళ్లారి రీజియన్‌లలో తెలుగు ప్రజలు అధికంగా ఉన్నారు. ఈ రీజియన్‌లలో ఉన్న అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేయనుందట. 
About Writer
pnr
తర్వాతి కథనం
ఆయన 'ఆల్‌ ది బెస్ట్' చెప్పారట.. అయితే, జనసేనలోకి వస్తారా?