శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (14:10 IST)

అవిశ్వాసంపై చర్చిస్తే సరేసరి.. లేకుంటే రాజీనామాలు చేసేయండి: ఎంపీలతో జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అవిశ్వాసంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాసంపై చర్చ జరగని పక్షంలో సభ వాయిదా పడితే వెంటనే ఎంపీలు రాజీనామాలు చేయాలని జగన్ నిర్దేశించారు. అల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అవిశ్వాసంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాసంపై చర్చ జరగని పక్షంలో సభ వాయిదా పడితే వెంటనే ఎంపీలు రాజీనామాలు చేయాలని జగన్ నిర్దేశించారు. అలాగే కేంద్రం ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రకటన చేయని పక్షంలో వచ్చే నెల ఆరో తేదీన రాజీనామా చేస్తారని, అంతకంటే ముందుగానే తామిచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చ జరగకుండా వాయిదా వేస్తే వాయిదా వేసిన రోజునే ఎంపీలంతా రాజీనామా చేస్తారని జగన్ ప్రకటన చేశారు. 
 
అన్నాడీఎంకే నేతలు, టీఆర్ఎస్ నేతలకు నచ్చజెప్పి అవిశ్వాసంపై కేంద్ర సర్కారు చర్చ జరిపించాలి. అలా కాకుండా అవిశ్వాసంపై చర్చ జరపకుండా పార్లమెంట్‌ను నిరవధిక వాయిదా వేస్తే.. తమ ఎంపీలు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. ఇంకా తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే తమ ఎంపీల రాజీనామా పత్రాలు ఉంటాయని అన్నారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా తేవడమే లక్ష్యంగా పనిచేయాలని ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, పోరాటాన్ని కొనసాగించాలని వైఎస్ జగన్ తన పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో ఎంపీలతో సమావేశమైన జగన్ పార్లమెంట్‌లో తదుపరి పాటించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేంతవరకు నిరసనను కొనసాగించాలన్నారు.