బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (12:50 IST)

జయలలితను ఎవరూ చూడకూడదనే సీసీటీవీ కెమెరాలను స్విచ్ఛాఫ్ చేశాం

తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత కేసుకు సంబంధించి రోజుకో కథ పుట్టుకొస్తుంది. జయలలిత మృతిపై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. జయలలిత మృతిపై హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి కమిటీ విచారణ జరుపుతున్న

తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత కేసుకు సంబంధించి రోజుకో కథ పుట్టుకొస్తుంది. జయలలిత మృతిపై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. జయలలిత మృతిపై హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలిత చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 
 
ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో జయలలిత చేరిన తర్వాత ఐసీయూల సీసీ టీవీ కెమెరాలను ఆఫ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జయలలితకు ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలను జస్టిస్ అర్ముగస్వామి కమిటీకి అందించినట్టు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. జయ అపస్మారక స్థితిలోనే ఆసుపత్రిలో చేరినట్టు చెప్పిన ప్రతాప్ రెడ్డి డిశ్చార్జ్ చేసే సమయం వచ్చిందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుండె పోటు రావడంతో ఆమె మృతి చెందినట్టు తెలిపారు
 
ఐసీయూలో ఆమెకు చికిత్స అందించినన్ని రోజులు సీసీ టీవీ కెమెరాలను ఆఫ్ చేసినట్టు అపోలో చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆమెను ఎవరూ చూడకూడదనే ఉద్దేశంతోనే సీసీటీవీ కెమెరాలను స్వీచ్చాఫ్ చేసినట్టు వివరణ ఇచ్చారు.