గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (17:02 IST)

ఇది రీలా రియలా.. ఒకే వేదికపై నలుగురిని పెళ్లాడిన యువకుడు

Marriage
Marriage
ఒకే వేదికపై నలుగురు యువతులను పెళ్లాడాడు ఓ యువకుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో తెల్లటి దుస్తులు ధరించిన వరుడు.. అతని వెనుక సంప్రదాయబద్ధంగా ముస్తాబైన నలుగురు వధువులు ప్రదక్షిణలు చేస్తున్నట్లు కనిపించింది. 
 
చివర్లో నలుగురు యువతులు భర్త పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక నెటిజన్లు ఇది ఫేక్ వీడియో అని కొందరు.. రీల్ చేస్తూ ప్రదక్షిణ చేసే డైరెక్షన్ మర్చిపోయారు అని కొందరు హాస్యాస్పదమైన కామెంట్లు పెట్టారు. 
marriage
marriage


ఈ వివాహం గత ఏడాది జార్ఖండ్‌కు చెందిన సందీప్ అనే వ్యక్తి ఒకే వివాహ వేడుకలో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్న సంఘటనను గుర్తు చేస్తుంది.