బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (17:14 IST)

ఐఎస్ఐఎస్ కేసు-మహారాష్ట్ర, కర్ణాటకలో 41 చోట్ల తనిఖీలు.. 15మంది అరెస్ట్

మహారాష్ట్ర, కర్ణాటకలోని మొత్తం 41 చోట్ల కేంద్ర బలగాలు తనిఖీలు చేశాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో ఉగ్ర కలకలం రేగింది. ఐఎస్ఐఎస్ టెర్రర్ మాడ్యుల్ కేసు సంబంధం ఉన్న ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులు 15 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారిలో పలువురు ఇటీవలే అరెస్ట్ అయి, బెయిల్ పై బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారు. 
 
దేశ ఆర్థిక రాజధాని ముంబై పక్కనే ఉన్న థానె, పూణేలతో పాటు మిరాభయాందర్‌లలో ఎన్ఐఏ ఈ సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఆకిఫ్ అతీఖ్ నాచన్ సహా ఏడుగురిని అరెస్టు చేసింది. నాచన్ కిందటి ఆగస్టులో పేలుడు పదార్థాల తయారీ కేసులో అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు. మిగతా ఆరుగురిపై గతంలో ఎలాంటి కేసులు లేవని, అరెస్టు కాలేదని వివరించారు.