సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (15:05 IST)

టేస్ట్‌గా వండిపెట్టలేదని కన్నతల్లిని కడతేర్చాడు..

కన్నతల్లినే ఓ కుమారుడు కడతేర్చాడు. అది కూడా రుచికరమైన ఆహారం వడ్డించలేదని.. వంట చేతకాదనే కారణంతో ఓ కుమారుడు కన్నతల్లిని పొట్టనబెట్టుకున్నాడు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘటన జరిగింది. 
 
ఇంటి సమస్యల విషయంలో తల్లి, కొడుకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఈ హత్య జరిగిందని పోలీసులు వివరించారు. టేస్టీగా వండి పెట్టలేదని తల్లితో గొడవ పడిన కుమారుడు.. ఆగ్రహంతో ఆమె మెడపై కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాలతో ప్రాణాలు విడిచింది. 
 
అనంతరం నిందితుడు ఆత్మహత్యకు యత్నించి నిద్రమాత్రలు మింగాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద సోమవారం కేసు నమోదు చేసినట్లు వివరించారు.