సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 నవంబరు 2023 (13:57 IST)

గుజరాత్‌లో అకాల వర్షాలు.. పిడుగుపాటుకు 20మంది మృతి

lightning
గుజరాత్‌ను అకాల వర్షాలు కుదిపేశాయి. ఆదివారం గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, పిడుగులతో కూడిన అకాల వర్షం కారణంగా  20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. 
 
మొత్తం 254 తాలూకాల్లోని 234 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 
 
భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అకాల వర్షాలు పలువుర్ని బలితీసుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.