1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జులై 2023 (16:26 IST)

బీహార్‌లో పిడుగుల వర్షం... పిట్టల్లా రాలిపోయిన 32 మంది

thunder
గత కొన్ని రోజులుగా బీహార్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి అనేక మంది చనిపోతురున్నారు. అయితే, అనేక చోట్ల పిడుగులు పడుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా పడిన పిడుగుల్లో ఏకంగా 32 మంది చనిపోయారు. మొత్తం 14 జిల్లాల్లో ఈ మరణాలు సంభవించాయని బీహార్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.
 
చనిపోయిన మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరిహారం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున అందజేయాలని ఆదేశించారు. ఇదిలావుంటే బీహార్ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఈశాన్య, నైరుతి బీహార్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. 
 
ఏసీ గది కోసం అత్తింటివారిపై దాడి 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గర్భం దాల్చిన తమ కుమార్తె బిడ్డను ప్రసవించేందుకు ఏసీ గదిని ఏర్పాటు చేయలేదన్న కోపంతో అత్తింటి వారిపై పుట్టింటివారు దాడి చేశారు. ఏసీ లేని గదిలో తమ కుమార్తె ప్రసవించిందని తెలిసిన ఈ దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో తొలుత వియ్యంకుడితో వాగ్వాదానికి దిగారు. చివరకు ఆయనపై దాడి చేశారు. దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ జిల్లాకు చెందిన ఓ గర్భిణిని ఆమె అత్తింతిటివారు ప్రసంవం కోసం ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను చూసేందుకు వచ్చిన పుట్టింటివారు తమ కుమార్తెను ఏసీ లేని గదిలో ఉంచి, అక్కడే ప్రసవించిందని తెలుసుకుని తీవ్ర ఆగ్రహోద్రుక్తులయ్యారు. పైగా, అత్తింటివారితో గొడవకు దిగారు. ఏసీ గది ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ గర్భిణి తల్లిదండ్రులు తమ వియ్యంకుడు రాజ్‌కుమార్‌తో గొడవకు దిగారు. చివరకు ఆయనపై చేయి చేసుకున్నారు. చివరకు ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు ఇరు కుటుంబాల వారిని పిలిచి విచారిస్తున్నారు.