1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 29 మార్చి 2023 (15:35 IST)

పాపికొండల విహార యాత్ర పునః ప్రారంభం

Papikondalu
పాపికొండల విహార యాత్ర పునః ప్రారంభం కానుంది. ఈ వార్త విహార యాత్రికులకు గుడ్ న్యూస్ కానుంది. పాపికొండల అందాలను తనివితీరా చూసి ఆస్వాదించాలనుకునే వారు ఈ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. అకాల వర్షాల కారణంగా ఇటీవల పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు. 
 
ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు వేసవి కాలం కావడంతో  విహార యాత్రకు అధికారులుడ మళ్లీ పచ్చజెండా ఊపారు. కంట్రోల్ రూము వద్ద తనిఖీల అనంతరం పర్యాటక బోట్లకు అనుమతులిచ్చారు. 
 
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి మంగళవారం రెండు బోట్లు పర్యాటకులతో వెళ్లినట్టు అధికారులు చెప్పారు.