శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2023 (12:23 IST)

ఒడిశాలో పిడుగుపాటు.. 12 మంది మృతి

lightning
ఒడిశాలో శనివారం భారీగా పిడుగులు పడ్డాయి. కేవలం రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 61 వేల పిడుగుల పడ్డాయి. ఈ ఘటనల్లో 12 మంది మృతి చెందగా 14 మంది గాయాలపాలయ్యారు.
 
సెప్టెంబర్ 7 తరువాత వాతావరణం రాష్ట్రంలో సాధారణ స్థితికి వస్తుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తరువాత కూడా పిడుగుపాట్లు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహు తెలిపారు. 
 
ఇక బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం రాబోయే రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. కాగా, పిడుగుపాటుకు మరణించిన వారి కుటుంబాలకు రూ.నాలు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సాహూ తెలిపారు.