భాగస్వామి ఫోటోను షేర్ చేసిన ఇలియానా...
ఇలియానా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆ తర్వాత తాను గర్భవతినని, మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపింది. తన కొడుకు పేరు గోవా ఫీనిక్స్ డోలన్ అని కూడా ఇటీవల ఆమె తెలిపింది. అయితే తన భాగస్వామిని రహస్యంగా ఉంచింది.
అయితే తాజాగా ఇలియానా తన భాగస్వామికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. తన భాగస్వామితో కలిసి హ్యాపీ మూడ్‌లో నవ్వుతూ దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇప్పటివరకు తన భాగస్వామి ఎవరనేది వెల్లడించని ఇలియానా డి క్రూజ్ తొలిసారిగా తన ముఖాన్ని బయటపెట్టింది.
రెండు రోజుల క్రితం తన పాప ముఖాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఇలియానా ఇప్పుడు తన భాగస్వామి ఎవరో కూడా వెల్లడించింది.
ఇంతకుముందు, ఇలియానా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో వుంది. ఆపై బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సోదరుడు లారెంట్ మైఖేల్‌తో ప్రేమలో వున్నట్లు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత ఇలియానా గత మేలో మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకున్నట్లు ప్రకటించింది.