గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (16:28 IST)

మహేష్ బాబు లాంచ్ చేసిన హాయ్ నాన్నా నుంచి సెకండ్ సింగిల్ గాజుబొమ్మ

Hai naana song still
Hai naana song still
నేచురల్ స్టార్ నాని, బ్యూటీఫుల్ మృణాల్ ఠాకూర్ తొలిసారి జంటగా నటిస్తున్న  పాన్ ఇండియా ఎంటర్ టైనర్ 'హాయ్ నాన్నా'.  హాయ్ నాన్నా సాధారణ ప్రేమకథ కాదు, ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అందమైన, భావోద్వేగ ప్రయాణాన్ని ప్రజెంట్ చేస్తుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  బేబీ కియారా ఖన్నా నాని కూతురిగా నటించింది.
 
మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా, మేకర్స్ చిత్రం సెకండ్ సింగిల్-గాజు బొమ్మ పాటని విడుదల చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పాటను లాంచ్ చేశారు.  ''నన్ను కదిలించినట్లే ప్రతి తండ్రిని హత్తుకునే పాటిది.♥️ #గాజుబొమ్మ! టీమ్‌కి శుభాకాంక్షలు!! #హాయ్‌నాన్నా" అని మహేష్ బాబు పేర్కొన్నారు.
 
గాజు బొమ్మ ఒక తండ్రి, కూతురు పంచుకునే అందమైన ప్రేమను ఎస్టాబ్లిష్ చేసింది. ఈ పాట తన కూతురికి పంచిన ప్రేమతో పాటు సింగిల్ పేరెంట్‌గా ఉండటంలో అతని భావోద్వేగ అనుబంధం ప్రజెంట్ చేస్తోంది.
 
హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ ప్రత్యేకమైన పాటకు సరైన ట్యూన్ ని స్వరపరిచారు. తన సొంత వాయిస్‌లో పాటకు భావోద్వేగాలను కూడా జోడించాడు. కంపోజింగ్ లో వయోలిన్, ఫ్లూట్, అకౌస్టిక్, బాస్ గిటార్‌ లు వాడిన తీరు అద్భుతంగా వుంది. ఇది ఇటీవలి కాలంలో బెస్ట్ సోల్ ఫుల్ నంబర్‌లలో ఒకటిగా నిలిచింది. అనంత శ్రీరామ్...  కూతురి పట్ల తండ్రికి ఉన్న ఆరాధనను తెపిపే చక్కని సాహిత్యం అందించారు. నాని, కియారా ఖన్నాల లవ్లీ కెమిస్ట్రీ విజువల్స్‌ని అందంగా చూపించింది. గాజు బొమ్మ  అద్భుతమైన స్కోర్, వాయిస్ , సాహిత్యం, విజువల్స్ తో ఇన్స్టంట్  హిట్ గా నిలిచింది.
 
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సాను జాన్ వరుగీస్ ISC డీవోపీగా , ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 
హాయ్ నాన్నా ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది