శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (15:55 IST)

హాయ్ నాన్న సెకెండ్ సింగిల్ గాజు బొమ్మ రాబోతుంది

Hi nanna
Hi nanna
నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హాయ్ నాన్నా' మ్యూజికల్ చార్ట్ బస్టర్ నెంబర్ సమయమాతో ప్రారంభమైయింది. ఈ పాట లీడ్ పెయిర్ -నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీని చూపించింది. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ గాజు బొమ్మ అక్టోబర్ 6న విడుదల కానుంది.
 
నాని, కియారా ఖన్నా ముచ్చటగా మాట్లాడుకుంటున్న వీడియో ద్వారా ఇదే విషయాన్ని అనౌన్స్ చేశారు. ''లవ్ సాంగ్ రిలీజ్ చేశావ్.. మరి మన సాంగ్ ? అని బేబీ కియారా నానిని అడుగుతుంది. నాని పాపని గాజు బొమ్మ అని పిలుస్తాడు. తండ్రి కూతురు నేపధ్యంలోని ఈ పాట 'హాయ్ నాన్నా' సోల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.
 
హాయ్ నాన్న తో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు.
 
హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సాను జాన్ వరుగీస్ ISC  డీవోపీగా, ప్రవీణ్ ఆంథోని ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
 
హాయ్ నాన్నా ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది