శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (09:17 IST)

మనిషి పుట్టుక పుట్టిన ఎవడైనా అలా మాట్లాడుతాడా? అయ్యన్నపాత్రుడు

ayyanna patrudu
మనిషి పుట్టుక పుట్టిన ఎవడైనా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడినట్టుగా మాట్లాడుతారా అని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొడాలి నానికి చంద్రబాబును, నారా లోకేశ్‌ను భువనేశ్వరి, వారి కుటుంబ సభ్యులను విమర్శించడం మినహా ఇంకేం పని ఉందన్నారు. ఆయన మంత్రిగా పని చేసిన సమయంలో ఏనాడైనా తన శాఖ గురించి మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. 
 
ప్రజలకు పనికొచ్చే పని చేశావా? అధికారాన్ని ఉపయోగించుకొని పేకాడ క్లబ్బులు వంటి వాటితో డబ్బులు సంపాదించుకోవడం తప్ప, నీ శాఖపరంగా మంచి చేశావని చెప్పగలవా? అని నిలదీశారు. మనిషిగా పుట్టినవారు ఎవరైనా అలా మాట్లాడతారా? సంస్కారం ఉన్నవాళ్లు అలా మాట్లాడతారా? ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఇలా దిగజారి మాట్లాడుతారా? అని నిలదీశారు. 
 
ఈరోజు చంద్రబాబు గురించి ఎన్నో దేశాలవారు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఏపీ కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారని, నీలాంటి సన్నాసులకు అది కనిపించదని కొడాలి నానిని ఉద్దేశించి అన్నారు. మా పార్టీ అధినేతపై మీరు చేస్తున్న కుట్రలకు ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి మీ నాయకుడు జగన్ అయితే, ఏ తప్పు చేయకుండా రాత్రింబవళ్లు కష్టపడ్డ వ్యక్తి చంద్రబాబు అన్నారు.
 
ఓ వ్యక్తిపై ఇష్టం లేకుంటే జైల్లో వేస్తారా? అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారన్నారు. మీ నాయకుడు దొంగ... ముఖ్యమంత్రి అంటూ కొడాలి నానిని ఉద్దేశించి అన్నారు. జగన్ ఇపుడు పాదయాత్ర చేయగలడా? అన్నారు. ఈ రోజు ఆయన పాదయాత్ర చేస్తే అందరూ అడ్డుకుంటున్నారని, అది జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలన తీరు అని వ్యాఖ్యానించారు.