గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (21:33 IST)

దోమలు కుట్టక రంభా, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా?

kodali nani
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి టీడీపీపై ఫైర్ అయ్యారు. జైల్లో దోమలు కుడుతున్నాయి అంటున్నారు. మరి దోమలు కుట్టక రంభా, ఊర్వశి, మేనకలు వచ్చి కన్ను కొడతారా? అంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నంత కాలం వైసీపీ గెలుపుకు ఏమాత్రం ఢోకా లేదని కొడాలి నాని నమ్మకం వ్యక్తం చేశారు. 
 
వాడెవడో స్టార్ వస్తే... లోకేశ్ వాడ్ని అన్నయ్యా అంటున్నాడని ఎత్తిపొడిచారు. ఓ పక్కన్న మామయ్య, మరో పక్కన అన్నయ్యను పెట్టుకుని లోకేశ్ ఏంచేయాలనుకుంటున్నాడని ప్రశ్నించారు.  
 
చాతనైతే జైల్లో పెట్టండన్న చంద్రబాబు ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల వెంట తిరుగుతున్నాడన్నారు. ఏపీలో సింపతీ గేమ్స్ పనిచేయవని కొడాలి నాని స్పష్టం చేశారు.