బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (12:23 IST)

వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న జగన్.. ఛైర్‌లోనే కూర్చుని..?

ys jagan
ఏపీ సీఎం జగన్ కొన్ని రోజుల పాటు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. లండన్ ట్రిప్ నుంచి తిరిగొచ్చాక ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. 
 
శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో సైతం జగన్ మాట్లాడకుండా, తన ఛైర్‌లో కూర్చుండిపోయారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతుండగా చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసిన సమాచారం జగన్‌కు అందింది. దీనిపై కూడా జగన్ మాట్లాడలేదు.
 
దీనిపై జగన్ పంపిన స్లిప్ ద్వారా బుగ్గన చంద్రబాబు విషయాన్ని సభలో ప్రకటించారు. ఇంకా వైరల్ ఫీవర్ నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని ఆశించారు.