సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2023 (16:01 IST)

రోషన్ కనకాల, మానస చౌదరి పై బబుల్‌గమ్ ఫస్ట్ సింగిల్ రాబోతుంది

Roshan Kanakala, Manasa Chaudhary
Roshan Kanakala, Manasa Chaudhary
ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల, పాపులర్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్‌ కనకాల జెన్జీ లవ్ స్టోరీ ‘బబుల్‌గమ్‌’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో ఎక్స్ ట్రార్డినరీ వర్క్ తో ఆకట్టుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరి కథానాయిక.

ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రోషన్ డైనమిక్  స్క్రీన్ ప్రజెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. యాక్షన్, డైలాగ్.. ఇలా అన్నిట్లోనూ చాలా అనుభవం వున్న నటుడిలా ఎక్స్ ట్రార్డినరీ గా చేశాడు.

ఈ రోజు మేకర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ సరికొత్త పోస్టర్ తో మ్యుజికల్ ఫెస్ట్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. నవంబర్ 3న బబుల్‌గమ్ ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. పోస్టర్ లో  రోషన్, మానస ఫెస్టివల్ వైబ్ తో ఆకట్టుకున్నారు. వారి కెమిస్ట్రీ చాలా బ్యూటీఫుల్ గా వుంది. స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి వండర్ ఫుల్ ఆల్బమ్ ని కంపోజ్ చేశారు. పాటలన్నీ ప్రేక్షకులని అలరించేలా ఉండబోతున్నాయి.  

దర్శకుడు రవికాంత్ పేరెపు న్యూ ఏజ్ యూనిక్ కథని ఎంచుకున్నారు. టీజర్ సినిమా పై చాలా క్యురియాసిటీని పెంచింది. సురేష్ రగుతు డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి నిషాద్ యూసుఫ్ ఎడిటర్. శివమ్ రావు ప్రొడక్షన్ డిజైనర్.

డిసెంబర్ 29, 2023న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.