1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Gone Viral: Madurai couple prints QR code on wedding card for guests to transfer gift cash

పెళ్లి పత్రికపై క్యూఆర్ కోడ్.. నగదును ఇలా ట్రాన్స్‌ఫర్ చేయండి..

Madurai couple
QR Code
ప్రస్తుతం అంతా డిజిటల్ మయం. అంతా ఫోన్ నుంచే క్షణాలలో జరిగిపోతున్నాయి. అయితే తాజాగా తమిళనాడులోని మధురైలో ఓ పెళ్లి జంట వైరటీగా పెళ్లి పత్రిక పైన క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. గూగుల్ పే, ఫోన్ పే క్యూఆర్ కోడ్‌లను ఆ పత్రికపై ప్రింట్ చేశారు. పెళ్ళికి వచ్చిన వారు, కరోనాకి భయపడి రానివారు గూగుల్ పే లేదా ఫోన్‌పే ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే వీలును కల్పించారు. 
 
అయితే దీనిని పెళ్ళికి వచ్చిన ముప్పై మంది మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా వివాహం ఆదివారం జరిగింది. బెంగుళూరులో ఐటీ సంస్థలో పనిచేస్తున్న మదురైకి చెందిన శివశంకరికి మదురై బాలరంగాపురంకు చెందిన శరవణన్‌కు ఆదివారం ఉదయం వివాహం జరిగింది. వెడ్డింగ్ ప్రజెంట్‌గా నగదు ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్‌లను వాడుకున్నారు
తర్వాతి కథనం
బాల్య వివాహాలు నేరం అయినప్పుడు, బాల్యంలో జరిగిన పెళ్లిళ్లు అక్రమం ఎందుకు కాదు