1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Grandmother Gives 5 Hilarious Tips to Living Life

వందేళ్లు జీవించాలంటే.. ఈ ఐదు బామ్మ సూత్రాలు పాటిస్తే చాలట..!

Hundred years
Grandmother
వందేళ్లు జీవించాలంటే.. ఈ బామ్మ చెప్పే ఐదు సూత్రాలను పాటించాలట. వందేండ్ల వయసున్న బామ్మ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసుకుని వేలాది మంది హృదయాలను గెలుచుకుంది. అందమైన డ్రెస్‌ ధరించి.. తలపై టోపీ పెట్టుకుని ఉండి.. వెనకనుంచి వచ్చే పాటకు అనుగుణంగా చేతులు ఊపుతూ ఐదు సూత్రాలు చెప్తున్న ఈ బామ్మ వీడియో.. హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే తన అధికారిక ఖాతాలో పోస్టు చేసింది.
 
'కచ్చితంగా అవసరం వచ్చేంత వరకు ఒంటరిగా ఉండండి', 'మీ స్మార్ట్‌ఫోన్‌లను విసిరేయండి', 'ప్రతి సంవత్సరం ఒక నెల జీతం ఆదా చేసుకోండి', 'జీవితాన్ని తీవ్రంగా పరిగణించవద్దు' 'బాధలో ఉన్నవారికి మీ చిరునవ్వును ఇవ్వండి' అని ఐదు సూత్రాలను చెప్పింది.
 
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు 50 వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోను చూసిన ఎందరో తమకు ఎంతో నచ్చిందని, తప్పకుండా పాటించాల్సిన అంశాలని, థ్యాంక్యూ బామ్మ అని.. నెటిజెన్లు కామెంట్లు పోస్ట్‌ చేస్తూ తమ అభినందనలు తెలియజేస్తున్నారు. 
తర్వాతి కథనం
కొడుకు గడప దాటడం ఆలస్యం కోడలిపై మామ అఘాయిత్యం