శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (10:53 IST)

మహిళ శ్వాసనాళంలో చిన్నపాటి విజిల్.. ఒకటే దగ్గు..

మహిళకు దగ్గుతో బాధపడుతూ వచ్చింది. చివరికి దగ్గు సమస్యకు కారణం తెలిసి వైద్యులు షాకయ్యారు. కారణం ఏంటంటే శ్వాసనాళంలో చిన్నపాటి విజిల్ ఇరుక్కుపోయింది. దగ్గు సమస్యకు ఇదే అసలు కారణమని గుర్తించిన వైద్యులు... శస్త్ర చికిత్స ద్వారా దాన్ని తొలగించారు.
 
వివరాల్లోకి వెళ్తే... కన్నూరు జిల్లా మట్టన్నూర్‌కు చెందిన ఓ మహిళ (45) 25 ఏళ్ల వయసులో అనుకోకుండా విజిల్‌ను మింగేసింది. విజిల్ మింగిన విషయం ఆమె కూడా గుర్తించలేకపోయింది. అప్పటినుంచి ఆమె శ్వాసకోశ సమస్య, దగ్గుతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. బహువా అస్తమా వల్లే ఈ సమస్య వస్తోందని ఆమె భావించారు.
 
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె కన్నూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అక్కడ డా.రాజీవ్ రామ్ నేత్రుత్వంలోని వైద్యుల బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె శ్వాస నాళంలో చిన్నపాటి విజిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. 
 
శ్వాసనాళానికి అది అడ్డుగా ఉండటంతో ఆమె శ్వాసకోశ, దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు నిర్దారించారు.దీంతో ఆమె గొంతుకు శస్త్ర చికిత్స చేసి ఎట్టకేలకు విజిల్‌ను తొలగించారు. గత 20 ఏళ్లుగా ఆ విజిల్ కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఆమెకు ఇప్పుడు ఉపశమనం లభించినట్లయింది.