1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Four years boy died Bhuvanagiri

భువనగిరిలో చిన్నారి మృతి.. అటవీ జంతువులు చిదిమేశాయి..

Four years
యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగేళ్ల వయసున్న ఓ చిన్నారి బాలుడ్ని అటవీ జంతువులు చంపేశాయి. చిన్నారి తలను తీవ్రంగా కొరికి చిదిమేశాయి. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాల మర్రి గ్రామ శివారులో చిత్తూరు జిల్లా వాపన్‌ పల్లి కాలనీకి చెందిన శివ, అతని కొడుకు హరీశ్ కుటుంబంతో సహా వలసవచ్చారు. 
 
వీరు చుట్టుపక్కల ఊర్లలో కోళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. హరీశ్‌కు భార్య గంగోత్రి, కొడుకు నాలుగేళ్ల మునేశ్వర్ రావు ఉన్నారు. రోజూలాగే బుధవారం సాయంత్రం కూడా వీరు కోళ్లు అమ్ముకుని వచ్చారు.
 
రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి పూట పిల్లాడు ఏడవడంతో తల్లి గంగోత్రి నిద్రలేచి, పాలిచ్చింది. తర్వాత మళ్లీ నిద్రపోయారు. మళ్లీ తల్లి ఉదయం 5 గంటలకు లేచి చూసేసరికి దారుణం కనిపించింది. విగతజీవిగా మారిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.  
తర్వాతి కథనం
అసోంకు అతిథిగా వచ్చిన అరుదైన బాతు.. వీడియో వైరల్