శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (18:54 IST)

అసోంకు అతిథిగా వచ్చిన అరుదైన బాతు.. వీడియో వైరల్

mandarin duck
అరుదైన బాతు అసోంకు వచ్చింది. 118 ఏళ్ల తర్వాత కనిపించిన ఈ బాతుని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ బాతుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1902 తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ పక్షి ఇక్కడ కనిపించిందని, ఇది తననెంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసిందని స్థానిక బర్డ్ గైడ్ బినంద హతిబోరువా తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని టిన్సుకియా జిల్లాలోని మాగురి బిల్ అనే సరస్సు వన్యప్రాణులకు సహజ నివాసం. డిబ్రూ నదికి దక్షిణ ఒడ్డున అనేక రకాల పక్షులకు ఆలవాలం.. ఇక్కడ దాదాపు 304లకు పైగా వలస పక్షి జాతులు నివసిస్తుంటాయి. అయితే గత కొన్ని రోజుల క్రితం మాండరిన్ బాతు కనిపించడం విశేషం. ప్రపంచంలోని 10 అందమైన పక్షులలో ఒకటి'మాండరిన్ బాతు'. 
 
ఎరుపు రంగు ముక్కు, నలుపు రంగు తోక.. సప్తవర్ణాల మేళవింపుతో నెమలికి పోటీ వస్తూ కనువిందు చేస్తోందీ బాతు. ఇది చైనీస్ సంస్కృతికి చిహ్నం. మాండరిన్ బాతు యొక్క ఫోటో చైనాలో ప్రతిచోటా చూడవచ్చు ఆడ మాండరిన్ బాతుతో పోల్చితే, మగ బాతులు మరింత ఆకట్టుకునే రంగుల్లో ఉంటాయి. రష్యా, కొరియా, జపాన్‌తో పాటు చైనాలోని ఈశాన్య భాగాల్లో ఈ బాతులు ఎక్కువగా కనిపిస్తాయి.