సంబంధిత వార్తలు
- వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !
- 'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్
- గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?
- పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు
- Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల
ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?
పెళ్ళిళ్లు ఆగిపోవడాలు వినేవుంటాం. వివాహాలు ఆగిపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. అయితే ఢిల్లీలో ఓ వివాహ వేడుకలో మోగిన పాట ఆ పెళ్లిని రద్దు చేసింది. డీజేలో వాయించిన బాలీవుడ్ పాట "చన్నా మేరేయా" విన్న తర్వాత ఒక వరుడు తన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు.
ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలోని ఈ పాట తన మాజీ ప్రియురాలి గురించి తీవ్రమైన జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఈ పాట ఆ వరుడి పాత జ్ఞాపకాలను గుర్తు చేశాయని.. వెంటనే ఆ పెళ్లిని అక్కడికక్కడే రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
దీంతో 'బరాత్'లో వధువు వరుడు లేకుండా ఇంటికి తిరిగి వెళ్ళింది. ఈ సంఘటన పోస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆన్‌లైన్‌లో లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది. స్పందించిన వారిలో చిత్రనిర్మాత కరణ్ జోహార్ కూడా ఉన్నారు.
ఆయన ఏ దిల్ హై ముష్కిల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక పాటతో పెళ్లి క్యాన్సిల్ అవడమా అంటూ ఆయనతో పాటు పలువురు నెటిజన్లు షాక్ అవుతున్నారు.
