పేరుకే వెయిటర్.. మైకేల్ జాక్సన్‌లా స్టెప్పులు.. వీడియో వైరల్
waiter
వివరాల్లోకి వెళితే.. గువహటిలోని ఓ రెస్టారెంట్లో వెయిటర్‌గా పని చేస్తున్న సురాజిత్ త్రిపుర ఈ అద్భుతమైన డ్యాన్స్ చేశాడు. రెస్టారెంట్లో బాఘీ సినిమాలోని గర్ల్ ఐ నీడ్ యూ పాటకు సూపర్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. ఇతడి డ్యాన్స్‌కు ఫిదా అయిన సోనాలీ కృష్ణ అనే యూజర్ ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారు.
waiter
'ఈ రోజు గువహటిలో అద్భుతమైన వంటకం. అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మమ్మల్ని సర్ప్రైజ్ చేసినందుకు సురాజిత్ త్రిపురకు థాంక్స్. ఎదుగుతూ.. మెరుస్తూనే ఉండు సోదరా' అని ఆమె క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పేరుకే వెయిటర్ అని.. మైకేల్ జాక్సన్‌లా ఇరగదీస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
తర్వాతి కథనం
