1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (11:18 IST)

గువాహటిలోని సెంట్రల్ జైలులో 435మంది ఖైదీలకు కరోనా

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా అసోం రాజధాని గువాహటిలోని కేంద్ర కారాగారంలో 435 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. ఈ జైలులోని మొత్తం ఖైదీల సంఖ్యలో 44 శాతం మందికి కరోనా సోకడం గమనార్హం. రాష్ట్రంలోని 10 జైళ్లలో 535 మంది ఖైదీలకు, గువాహటి సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలకు వైరస్ సంక్రమించినట్టు అసోం జైళ్ల శాఖ డీజీ దశరథదాస్ తెలిపారు. 
 
గువాహటి జైలులో 200 పడకలతో ఖైదీల కోసం కరోనా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు డీజీ చెప్పారు. అలాగే, లక్షణాలు లేని ఖైదీలను నాగాం ప్రత్యేక జైలులో ఉంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఖైదీలందరికీ పరీక్షలు చేసినట్టు వివరించారు. కరోనా నేపథ్యంలో కొంత మంది ఖైదీలను విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు.