సంబంధిత వార్తలు
- డ్రోన్ల సాయంతో మందులు ఎగురుకుంటూ వస్తాయ్..!
- పిల్ల ఏనుగు చనిపోతే.. తల్లి ఏనుగుతో పాటు ఏనుగుల గుంపు ఏం చేసిందంటే? (వీడియో)
- చైనా నుంచి 48 వింగ్ లూంగ్ డ్రోన్లను కొనుగోలు పాకిస్థాన్
- బ్రహ్మాస్త్ర... 150 డ్రోన్లు ఒకేసారి ఆకాశంలోకి... నాగ్ ట్వీట్స్...
- ఏమయ్యా... బుర్రాబుద్ధీ వుందా... పులిరాజా సాంబార్ అన్నం తిని చచ్చిందా?
దంతం కోసం ఏనుగును ఇలా చంపేశారు.. డ్రోన్ తీసిన ఫోటో వైరల్
బోట్సువానా దంతం కోసం ఏనుగును దారుణంగా చంపేసిన ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఓ డ్రోన్ తన కెమెరాలో బంధించింది. ఈ దారుణమైన ఫోటోకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలోని బొట్సువానాలోని వేటకు నిషిద్ధమైన ప్రాంతానికి సమీపంలో.. దంతం కోసం ఏనుగును దారుణంగా చంపేశారు.
దంతాల కోసం ఏనుగులను హతమార్చడం పెరిగిపోతున్న తరుణంలో దీన్ని నిరోధించేందుకు ఓ ప్రైవేట్ సంస్థకు ఆధారంగా ఓ ఫోటోను పంపేందుకు ఐస్టీన్ అనే వ్యక్తి.. బోట్సువానా ప్రాంతంలో తన డ్రోన్‌ను ఎగిరేలా చేశాడు.
ఆ డ్రోన్ సాయంగా దంతం కోసం దారుణం ఏనుగు చంపేసిన ఫోటో కెమెరాకు చిక్కింది. ఏనుగు తలను నరికి.. దంతాన్ని రంపంతో కోసిన దృశ్యాలు డ్రోన్‌కు చిక్కాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దంతం కోసం మూగ జీవులను ఇలా హత్య చేయడంపై పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
తర్వాతి కథనం
