బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (10:49 IST)

చైనా నుంచి 48 వింగ్ లూంగ్ డ్రోన్లను కొనుగోలు పాకిస్థాన్

పుల్వామా ఉగ్ర దాడి, భారతవాయుసేన పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపిన అనంతంరం పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత మొదలైంది. యుద్ధం వద్దని, శాంతి కోరుతున్నామని పైకి చెబుతున్నా పాక్ దానిని పాటించడం లేదు. పలుమార్లు భారత్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. యుద్ధ పరిణామాలు దారితీసే విధంగా ప్రవర్తిస్తోంది. సరిహద్దుల్లో సైనికులతో మోర్టార్‌లతో కాల్పులు జరిపించడం వంటివి చేస్తోంది. 
 
ఒప్పందాలన్నింటినీ ఉల్లంఘిస్తోంది. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఆయుధాలతో కూడిన డ్రోన్లను రంగంలోకి దించిందని భారత సరిహద్దు భద్రతాదళం తన రహస్య నివేదికలో వెల్లడించింది. పాక్ సరిహద్దుల్లోని ఉరి, పూంచ్, రాజౌరి, నౌషెరా, సుందర్ బనీ సహా 12 ప్రాంతాలలో పాక్ ఆయుధాలతో కూడిన డ్రోన్‌లను రంగంలోకి దించిందని బీఎస్ఎఫ్ పేర్కొంది. 
 
గుజరాత్ రాష్ట్ర సరిహద్దుల్లో ఎగురుతున్న డ్రోన్‌ను ఇటీవల భారత సైన్యం కూల్చివేసింది. పాక్ డ్రోన్‌లతో సరిహద్దుల్లో నిఘా వేయడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. పాకిస్థాన్ గత ఏడాది చైనా నుంచి 48 వింగ్ లూంగ్ డ్రోన్లను కొనుగోలు చేసింది. పాక్ మిలిటరీకి తమ వంతు సహాయం చేస్తామని చైనా ఇదివరకే ప్రకటించింది. పాక్ డ్రోన్‌లు ఎగురుతుండటంతో బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. తగిన చర్యలు తీసుకుంటున్నాయి.