గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్ మొగరాల
Last Modified: మంగళవారం, 5 మార్చి 2019 (19:58 IST)

బ్రహ్మాస్త్ర... 150 డ్రోన్‌లు ఒకేసారి ఆకాశంలోకి... నాగ్ ట్వీట్స్...

బాలీవుడ్‌లో బ్రహ్మాస్త్ర అనే పేరుతో ఒక చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రణ్‌బీర్‌కపూర్‌, ఆలియాభట్‌, అమితాబ్‌బచ్చన్‌, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న కుంభమేళాలో నటీనటులు రణ్‍బీర్ కపూర్, ఆలియాభట్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
మహాశివరాత్రి సందర్భంగా సోమవారం రాత్రి చిత్ర టైటిల్‌ లోగోను వినూత్నంగా ఆవిష్కరించారు. వేలాది మంది చూస్తుండగా ఆకాశంలోకి 150 డ్రోన్‌లను ఒకేసారి పంపించారు. అవి పైకి వెళ్లి 'బ్రహ్మాస్త్ర' అనే అక్షరాల రూపంలో కనిపించి వీక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేశాయి. 
 
అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. కాగా డ్రోన్‌ల సాయంతో లోగోను ఆవిష్కరించిన విధానాన్ని నటుడు నాగార్జున ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోని మీరూ చూసి ఆనందించండి.