మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (16:23 IST)

పాండవులను చేతగాని వారని భావించారు.. చివరకు ... ఇండియన్ ఆర్మీ ట్వీట్

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రతాండాలపై భారత వైమానిక యుద్ధ విమానాలు మంగళవారం వేకువజామున మెరుపుదాడులు జరిపాయి. కేవలం 21 నిమిషాల్లో తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన మిరాజ్ యుద్ధ విమానాలు సురక్షితంగా తిరిగి వచ్చాయి. 
 
ఈ దాడులపై ఇండియన్ అర్మీ అధికారి ఓ ట్వీట్ చేశారు. భారత సైన్యాన్ని పాండవులతోనూ, పాకిస్థాన్ సైన్యాన్ని కౌవరులతో ఆయన పోల్చారు. ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ రచించిన పద్యాన్ని ఆ అధికారి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పద్యం వైరల్ అయింది. 
 
భారత సైన్యం ప్రజా సంబంధాల విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్‌ చేసిన ఈ పోస్ట్‌లో "కౌరవ, పాండవులను పోల్చుతూ సాగిన ఈ ట్వీట్‌లో శత్రువు ముందు తలొగ్గి ఉన్నామన్నంత మాత్రాన బలహీనులమని కాదన్న అర్థం వచ్చేలా ఈ పద్యం సాగుతుంది. యుద్ధానికి దిగని పాండవులను కూడా కౌరవులు చేతగాని వారని భావించి నష్టపోయారని గుర్తు చేస్తుంది".