శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (17:19 IST)

17-02-2019 నుంచి 23-02-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో బృహస్పతి, శుక్రుడు, ధనస్సులో శని, మకరంలో రవి, కేతువు, బుధులు, మీనంలో కుజుడు. కుంభ, మీన, మేష, వృషభంలలో చంద్రుడు. 22న సంకట హర చతుర్థి.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆధిపత్య ప్రదర్శించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు వేగవంతమవుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. మంగళ, బుధ వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడుతాయి. సంతానం చదువుల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి పెడతారు. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. నోటీసులు, ఆహ్వానం అందుకుంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. బుధ, గురు వారాల్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. యత్నాలు విరమించుకోవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం. శుభకార్యానికి హాజరవుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. వృత్తుల వారికి పురోభివృద్ధి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికస్థితి సామాన్యం. ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెన్నాడుతుంది. ఆలోచనులు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై పనులు ముందుకు సాగవు. శని వారాల్లో పెద్ద ఖర్చులు తగిలే ఆస్కారం ఉంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆప్తుల కలయికతో కుదుటపడుతారు. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఇంటి విషయాల పట్ల మరింత శ్రద్ధ అవసరం. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అకౌంట్స్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడుతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు సామాన్యం. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. సోమ, మంగళ వారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యపడదు ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. పట్టుదలకు పోవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పనివారలతో జాగ్రత్త. నిరుద్యోగులు రాత పరీక్షలకు హాజరవుతారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. బుధు, శుక్ర వారాల్లో పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతులకు కొత్త ఆలోచనులు స్పురిస్తాయి. మీ జోక్యం అనివార్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. న్యాయ, వైద్య రంగాల వారికి పురోభివృద్ధి. ప్రయాణం తలపెడతారు.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థిక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. గృహమార్పు కలిసివస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. శనివారం నాడు ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. అనేక పనులతో సతమతమవుతారు. బంధువుల వ్యాఖ్యాలు ఆలోచింపచేస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. దంపతుల మధ్య అరమరికలు తగవు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.     
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషాన్నిస్తుంది. కానుకలు సమర్పించుకుంటారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆది, సోమ వారాల్లో పనులు మొండిగా పూర్తిచేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. వ్యవహారానుకూలత ఉంది. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రశంసలందుకుంటారు. ఆశావాహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఆర్థిక లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడుతారు. కొత్త విషయాలు తెలుస్తాయి. మంగళ, బుధ వారాల్లో అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు ఆప్తుల సలహా పాటించండి. వివాహ యత్నం ఫలిస్తుంది. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. స్థిమితంగా ఆలోచించాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. అకౌంట్స్ రంగాల వారికి శ్రమ అధికం.  
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. బుధవారం నాడు పట్టుదలతో శ్రమించిన గానీ పనులు పూర్తికావు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. సంతానం చదువుల పట్ల మరింత శ్రద్ధ అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. చిరువ్యాపారులకు ఆశాజనకం. సంస్థల స్థాపనలకు అభ్యంతరాలెదురవుతాయి. సమావేశాల్లో పాల్గొంటారు. తేదీలలో జయం పొందుతారు.   
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభకార్యాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. మీ రాక సన్నిహితులకు ఉత్సాహాన్నిస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆపన్నులకు సాయం అందిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. గురు, శుక్ర వారాల్లో ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ నుండి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. టెంటర్లు, కాంట్రాక్టులు చేజారిపోతాయి. గృహమార్పు అనివార్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్నతరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహకరం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. జూదాల జోలికి పోవద్దు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ఈ వారం దుబారా ఖర్చులు విపరీతం. కొత్త సమస్యలెదురవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. వ్యవహారాల్లో ప్రతికూలతలుంటాయి. ఆచితూచి అడుగేయాలి. సొంత నిర్ణయాలు తగవు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఏజెన్సీలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. శుభకార్యంలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. ఎదురుచూస్తున పత్రాలు అందుతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలుగుతాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విద్యార్థులు ఒత్తిడి అధికం.