బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (18:19 IST)

25-11-2018 నుంచి 01-12-2018 వరకూ మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో రాహువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి, గురువు, వక్రి బుధులు, ధనస్సులో శని, మకరంలో కేతువు, కుంభంలో కేతువు. మిధునం, కర్కాటక, సింహ, కన్యలలో చంద్రుడు. 26న సంకట హరచతుర్థి. ఈ వారం విఘ్నేశ్వరుని ఆరాధన శుభదాయకం. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. వ్యవహారానుకూలత ఉంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు సామాన్యం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. గృహ మరమ్మత్తులు చేపడతారు. సంతానం కదలికపై దృష్టడి సారించండి. శనివారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలుచేస్తారు. పెద్దమెుత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులకు చేరువవుతారు. వృత్తుల వారికి సామాన్యం. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం. దైవకార్యంలో పాల్గొంటారు.
 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ వారం సంప్రదింపులు ముందుకు సాగవు. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. అవకాశాలు చేజారిపోతాయి. ఏవిషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆప్తులను కలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు ముగింపుకొచ్చేసరికి మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సన్నిహితుల కలయికతో కుదుటపడుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలోస్తాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో పోటీని దీటుగా ఎదుర్కొంటారు. వృత్తుల వారికి ఆశాజనకం. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. జూదాలకు దూరంగా ఉండాలి.
 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. పరిచయాలు, వ్యాపకాలు విస్తృతమవుతాయి. వాగ్ధాటితో రాణిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. బంధువులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమెుత్తం సాయం అందించండి. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదా మార్పు, సహోద్యోగులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదుత. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. నగదు, పత్రాలు జాగ్రత్త. ఆది, సోమ వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అపరిచితులతో మితంగా సంభాషించండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు.
 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రముఖులతో పరిచయాలు బలపడుతాయి. పనులు సకాలంలో పూర్తికాగలవు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాధిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మంగళ, బుధ వారాల్లో ప్రకటనలు, ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. అవివాహితులు శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు ప్రయోజనకరం. డబ్బుకు లోటుండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ప్రేమానుబంధాలు బలపడుతాయి. పరిచయస్తులు సన్నిహితులవుతారు. కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. అనవసర జోక్యం తగదు. గురు, శుక్ర వారాల్లో ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. గృహమార్పు కలిగివస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వాహనయోగం, వ్యవహార జయం పొందుతారు. పెట్టుబడులకు అనుకూలం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వాహన చోదకులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయానికి తగ్గట్టు బడ్జెట్ రూపొందించుకుంటారు. పొదుపు పథకాలు లాభిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. శనివారం నాడు మీ జోక్యం అనివార్యం. చక్కని సలహాలిస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయెుద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. అనుకున్న ఖర్చులే ఉంటాయి. బాధ్యతలు అప్పగించి అవస్థలెదుర్కుంటారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతుల ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లును దీటుగా ఎదుర్కుంటారు. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది.
 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంప్రదింపులు ఫలించవు. ఆప్తుల సాయంతో కుదుటపడుతారు. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆర్థికస్థితి సామాన్యం ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనంమితంగా వ్యయం చేయండి. ఆది, సోమ వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. సహోద్యోగుల వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు ఆశాజనకం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. జూదాల, బెట్టింగ్‌లను దూరంగా ఉండాలి.
 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చులు విపరీతం. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. వ్యాపకాలు, పరిచయాలు బలపడుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మంగళ, బుధ వారాల్లో మీ శ్రీమతి వైఖరి అసహానం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. కుటుంబ సమస్యలు ఏకరవు పెట్టవద్దు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మార్కెట్ రంగాల వారు లక్ష్యాన్ని సాధిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.
 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. మీపై శకునాల ప్రారంభం అధికం. ఆది, సోమ వారాల్లో మనోధైర్యంతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. షాపుల స్థల మార్పు కలిసివస్తుంది. వైద్య రంగాలవారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వేడుకలకు హాజరవుతారు. వస్త్రలాభం, వాహనయోగం ఉన్నాయి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మంగళ, శని వారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు సామాన్యం. ధనానికి లోటుండదు. ఆర్థిక ఇబ్బంది లేకున్నా ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెన్నాడుతుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ఆహ్వానం, నోటిసులు అందుకుంటారు. గురు, శుక్ర వారాల్లో ప్రియతముల కలయిక సాధ్యం కాదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటరాు. శ్రీవారు లేక శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ముఖ్యులలొ ఒకరికి వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వృత్తుల వారికి జనసంబంధాలు బలపడుతాయి.