1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Is Virat Kohli shocks about Rohit Sharma Comments about Team India Captaincy?

కోహ్లికి చాక్లెట్ తప్పదా? ధోనీ నాకు స్ఫూర్తి... అవకాశం ఇస్తే కెప్టెన్‌గా రెడీ: రోహిత్

విరాట్ కోహ్లికి రోహిత్ శర్మ చాక్లెట్ పెట్టేట్లు వున్నాడు. ఆసియా కప్ కైవసం చేసుకున్న ఉత్సాహంలో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు కీలంగా వున్నాయి. శుక్రవారం రాత్రి అత్యంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Virat Kohli
విరాట్ కోహ్లికి రోహిత్ శర్మ చాక్లెట్ పెట్టేట్లు వున్నాడు. ఆసియా కప్ కైవసం చేసుకున్న ఉత్సాహంలో రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు కీలంగా వున్నాయి. శుక్రవారం రాత్రి అత్యంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఆసియా కప్ కైవసం చేసుకోవడంతో తనలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందనీ, అవకాశం వస్తే పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధంగా వున్నట్లు చెప్పాడు. 
 
అంతేకాదు... ఇంకాస్త ముందుకెళ్లి కెప్టెన్సీ బాధ్యత ఎలాంటిదో వివరించాడు. కెప్టెన్‌గా వున్నప్పుడు జట్టులో వున్నవారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. కెప్టెన్ అనేకన్నా జట్టులో నేను కూడా ఓ ఆటగాడిని అని ఫీలవ్వాలి. అప్పుడు నేను ఎలా ఫీలవుతానో జట్టు సభ్యులు కూడా అలాగే ఆలోచిస్తారని తెలుసుకున్నప్పుడు సమిష్టి కృషితో రాణించే అవకాశం వుంటుంది. 
 
ధోనీ గురించి చెపుతూ... ఆట ఆడేటప్పుడు మైదానంలో ఎలా వుండాలో ధోనీని చూసి నేర్చుకున్నాను. ఒత్తిడికి లోనవకుండా మ్యాచ్ ఎలా ఆడాలో ఆయనను చూసి తెలుసుకున్నాను. జట్టును గెలిపించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలను ఇప్పటికీ పరిశీలిస్తుంటాను. నేను ఆయనకు శిష్యుడిని అంతే అంటూ చెప్పుకొచ్చారు. రోహిత్ శర్మ మాటలను చూస్తుంటే విరాట్ కోహ్లి సీట్ చిరిగిపోయేట్లుగా వున్నదని కామెంట్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
అత్యాచారం, హత్యతో మృతి చెందిన బాలిక తల్లిదండ్రులకు చంద్రబాబు రూ. 5 లక్షల సాయం