బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 20 సెప్టెంబరు 2018 (18:18 IST)

విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. ఖేల్‌రత్నతో సత్కారం..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కనుంది. 2018 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో కోహ్లీని సత్కరించనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవలే రాజీవ్ గా

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కనుంది. 2018 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో కోహ్లీని సత్కరించనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవలే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు కోహ్లీతో పాటు వెయిట్ లిప్టర్ మీరాబాయి చాను నామినేట్ అయిన విషయం తెలిసిందే. 
 
ఈ ఇద్దరు క్రీడాకారులను ఖేల్ రత్న అవార్డుతో సత్కరిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరో ఎనిమిది మందికి ద్రోణాచార్య, 20 మందికి అర్జున అవార్డు, నలుగురికి ధ్యాన్‌చంద్ అవార్డులు దక్కాయని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
 
ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌ శ్రీనివాసరావుకు ద్రోణాచార్య అవార్డు దక్కింది. బ్యాడ్మింటన్‌లో నేలకుర్తి సిక్కిరెడ్డికి అర్జున అవార్డు, టెన్నిస్‌లో రోహన్‌ బోపన్నకు అర్జున అవార్డు, ఆర్చరీలో సత్యదేవ్‌ ప్రసాద్‌కు ధ్యాన్‌చంద్ అవార్డులు ప్రకటించింది.