గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (11:53 IST)

మైదానంలో ఆ ఫ్లయింగ్‌ కిస్‌ల గోలేంటి.. ఎర్రబడిన అనుష్క మొహం

భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మొహం ఎర్రబడిపోయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నతో ఆమెకు దిమ్మతిరిగిపోయింది. దీంతో ఆమె ముఖం ఎర్రబడిపోయిం

భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మొహం ఎర్రబడిపోయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నతో ఆమెకు దిమ్మతిరిగిపోయింది. దీంతో ఆమె ముఖం ఎర్రబడిపోయింది. ఆ తర్వాత తేరుకుని సిగ్గుతో సమాధానం చెప్పింది.
 
గత యేడాది డిసెంబరు నెలలో దేశంలో జరిగిన అతిపెద్ద ఈవెంట్లలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం ఒకటి. ఇద్దరూ కూడా వారివారి రంగాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ... తన భర్తను ఇంటా, బయటా కూడా మిస్ కాకుండా అనుష్క చూసుకుంటోంది. దాదాపు ప్రతి మ్యాచ్‌కు అనుష్క హాజరవుతోంది. 
 
విదేశాల్లో మ్యాచ్ జరిగే సమయంలో కూడా ఆమె అక్కడకు వెళ్తోంది. మ్యాచ్‌ల సందర్భంగా గ్యాలరీలో కూర్చొని తన భర్తను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు కోహ్లీ కూడా ఏదైనా సాధించినప్పుడు గ్రౌండ్ నుంచి తన భార్యకు ఫ్లైయింగ్ కిస్‌లు విసురుతుంటాడు. ఈ నేపథ్యంలో అనుష్కను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆటపట్టించారు. 
 
కౌన్‌బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి సామాజిక కార్యకర్త సుధా వర్గీస్‌తో పాటు అనుష్క వచ్చింది. ఈ సందర్భంగా ఈ ఫ్లయింగ్ కిస్‌ల గురించి అమితాబ్ ప్రశ్నించగా... అనుష్క మొహం సిగ్గుతో ఎరుపెక్కింది. అయితే, సమాధానాన్ని కూడా అంతే కొంటెగా చెప్పింది. తాను కోహ్లీ కోసమే క్రికెట్‌ను చూడనని... దేశం కోసం చూస్తానని తెలివిగా సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.