1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Jeff Bezos buys $68m mansion in ‘billionaire bunker’ for his fiancee

కాబోయే భార్యకు అమేజాన్ అధినేత కాస్టీ గిఫ్ట్.. ఏంటది?

Jeff Bezos
Jeff Bezos
అమేజాన్ అధినేత జెఫ్ బెజోస్ తనకు కాబోయే భార్యకు ఓ కాస్లీ గిఫ్ట్ ఇచ్చారు. జెఫ్ బెజోస్ 68 మిలియన్ డాలర్ల భవనాన్ని ఆమె కోసం కొనుగోలు చేసినట్లు సమాచారం. అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. 
 
అయితే ఆ ఆస్తిని జెఫ్ బెజోస్ జూన్ 2023లోనే కొనుగోలు చేసారని.. ఇప్పుడే ఆ సమాచారం బయటికి వచ్చిందని టాక్. జెఫ్ బెజోస్ చాలా కాలంగా మియామిలోని ఈ ఇండియన్ క్రీమ్ ప్రాంతంలో ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 
 
ఈ ప్రదేశం కోటీశ్వరులలో విపరీతమైన క్రేజ్‌ను కలిగి ఉంది. ఈ ప్రాంతం చాలా మంది బిలియనీర్లకు నిలయం. అందుకే దీనిని ‘బిలియనీర్స్ బంకర్’ అని కూడా పిలుస్తారు. ఇలాంటి ప్రాంతంలో అమేజాన్ అధినేత భవనం కొనుగోలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అంతర్జాతీయ విద్య కోసం తెలంగాణ- ఏపీ నుండి 100 మిలియన్ డాలర్ల చెల్లింపులను లక్ష్యంగా పెట్టుకున్న గ్లోబల్ క్రాస్-బోర్డర్ ఫిన్‌టెక్ HiWi