గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

దుబాయ్‌లో అత్యంత విలాసమైన విల్లాను కొనుగోలు చేసిన ముఖేష్ అంబానీ

palm jumeirah
ధనవంతుల భూతల స్వర్గంగా పేర్కొనే దుబాయ్‌లో భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ అత్యంత విలాసమైన విల్లాను కొనుగోలు చేశారు. ఈ దేశంలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన పామ్ జమేరా దీవిలో ఆయన ఈ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు. తన చిన్న కుమారుడు అనంత్ కోసం ఈ పామ్ జమేరా ఐలాండ్‌లో ఓ ఖరీదైన చిన్న విల్లాలను కొనుగోలు చేశారు. 
 
ఈ విల్లాకు ఇరుగుపొరుగువారు ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ అల్ట్రా లగ్జరీ భవింతికి ఓ వైపున బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ విల్లా, మరోవైపు, అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్ హామ్ విల్లాలు ఉన్నాయి. ఈ బిల్లు ఖరీదు రూ.640 కోట్లు. 
 
ఇందులో పది పడక గదులు, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, మరో ఔట్‌‍డోర్ స్విమ్మింగ్ పూల్, ఒక పర్సనలో స్పాలు ఉన్నాయి. అదేసమయంలో ఈ విల్లాను తన కుమారుడు అనంత్ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మరికొన్ని కోట్ల రూపాయలను ముఖేష్ అంబానీ కొనుగోలు చేయనున్నారని, ఈ విల్లా కొనుగోలులో కీలక పాత్ర పోషించిన ఓ రియల్టర్ కంపెనీ వెల్లడించింది.