గురువారం, 18 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (12:00 IST)

9999 ఫ్యాన్సీ నెంబర్‌ అంటే ఎన్టీఆర్‌కు ఎందుకంత ఇష్టం?

ఫ్యాన్సీ నంబర్ 9999 ఎవర్ గ్రీన్‌గా నిలుస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ప్యాన్సీ నెంబర్లకు వేలం పాట నిర్వహించారు. TS 09 FS 9999 నంబరును సినీనటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు. 
 
ఈ నెంబర్ కోసం ఎన్టీఆర్ 17 లక్షల భారీ వేలం పలికారు. ఇక ఎన్టీఆర్ కు ఈ నెంబర్ అంటే ఎంత ఇష్టమో అభిమానులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కొన్న కార్లకు ఎక్కువగా 9999 వచ్చేలా ఫాన్సీ నెంబర్లు మీద ఆయన ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
 
తాజాగా ఎన్టీఆర్.. అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మోడల్ కారు ఆన్ రోడ్ ధర రూ. 3.43 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా.. ఈ కారు కోసమే ఎన్టీఆర్ TS 09 FS 9999 నెంబర్ ను భారీ వేలంతో దక్కించుకున్నారు. గతంలో ఆయన పేరుమీదనే ఉన్న రికార్డును ఆయనే బ్రేక్ చేశారు.
 
ఇక ఎన్టీఆర్‌కు 9 అనే నెంబర్ ఆయనకు ఇష్టమైన నెంబర్.. కారుతో పాటు ట్విటర్‌ ఖాతాలో కూడా ఎన్టీఆర్‌ @tarak9999 కనిపిస్తుంది. 'తన తాత సీనియర్‌ ఎన్టీఆర్‌ కారు నెంబర్‌ 9999 అని, తన తండ్రి హరికృష్ట కూడా అదే వాడాడని.. అందుకే తనకు ఆ నెంబర్‌ అంటే ఇష్టమని ఎన్టీఆర్‌ ఓ సందర్భాల్లో చెప్పుకొచ్చాడు'.
 
కాగా, ఇవాళ జరిగిన అన్ని ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో ఎన్టీఆర్ దే హయ్యెస్టు బిడ్.. ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ఆర్టీయే అధికారులకు మొత్తం 45 లక్షల 52 వేల 921 రూపాయలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మరో రెండు ఫ్యాన్సీ నెంబర్లు గరిష్ట ధరకు అమ్ముడుపోయాయి.