గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మే 2022 (18:17 IST)

భార్యకు మోపెడ్ కొనిపెట్టిన యాచకుడు.. ఎక్కడ (video)

Beggar
Beggar
మధ్యప్రదేశ్‌లో ఓ యాచకుడు తన భార్య కోసం బుల్లెట్ కొనిపెట్టాడు. యాచకునికి రెండు కాళ్లు లేకపోవడంతో భార్య సాయంతో భిక్షాటన చేసేవాడు. 
 
మూడు చక్రాల వాహనంపై అతడు కూర్చుంటే.. భార్య అతనిని తోలుతూ వుండేది. అలా తోలుతున్న సమయంలో భార్య పడుతున్న కష్టాన్ని చూసి బాధపడిన యాచకుడు.. ఓ రోజు మోపైడ్ కొని గిఫ్ట్‌‌గా ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, చింధ్వారా జిల్లా అమరవర గ్రామంలో సంతోష్ సాహు దంపతులు నివాసం ఉండేవారు. సాహుకు రెండు కాళ్లు పనిచేయక పోవడంతో భార్య సహాయంతో భిక్షాటన చేసేవారు. త్రిచక్ర వాహనంలో తిరుగుతూ.. సాహూ యాచించేవాడు. 
 
వీరు యాచక వృత్తితోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చే వారు. రోజు వాహనాన్ని తోలుతుండడంతో భార్య అనారోగ్యానికి గురయ్యేది. ఆమె పడుతున్న కష్టాన్ని అతను చూడలేకపోయాడు. 
 
పైసా పైసా జమ చేశాడు సాహు. నాలుగు సంవత్సరాలుగా జమ చేసిన మొత్తం రూ. 90 వేలు అయిన తర్వాత.. మోపైడ్‌‌ను కొనుగోలు చేశాడు సాహు. ఇప్పుడు మోపైడ్‌‌పై భిక్షాటన చేస్తున్నారు. సాహు దంపతులు రోజుకు రూ. 300 నుంచి రూ. 400 వరకు సంపాదిస్తారని తెలుస్తోంది.