మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (16:44 IST)

యాచకుడికి అంతిమ వీడ్కోలు.. వేలాదిమంది తరలివచ్చారు...

Beggar
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మరణించిన మానసిక వికలాంగుడైన యాచకుడికి అంతిమ వీడ్కోలు పలికేందుకు వేలాదిగా తరలి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయ్‎నగర్ జిల్లా హడగలి పట్టణంలో నవంబర్ 12వ తేదీన హుచ్చా బస్యా (45) అనే వ్యక్తిని బస్సు ఢీకొట్టడంతో.. ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అతడు చనిపోయాడు. అతని అంతమ సంస్కారాలకు వేలాది మంది తరలి వచ్చారు.
 
బస్యా అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతని పట్ల తమకున్న గౌరవాన్ని తెలియజేయడానికి వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అతని పార్థివదేహాన్ని ఆర్టీరియల్ రోడ్డు మీదు అంతమయాత్ర నిర్వహించారు.
 
బస్యా ఒక వ్యక్తి నుంచి 1 రూపాయి మాత్రమే భిక్షగా తీసుకునేవాడని అక్కడి వారు చెబుతున్నారు. రూపాయి కంటే ఎక్కువ ఇస్తే అదనపు మొత్తాన్ని తిరిగి ఇచ్చేవాడని ప్రజలు గుర్తు చేసుకున్నారు. బలవంతం చేసినా ఎక్కువ డబ్బు తీసుకోడని చెప్పారు. బస్యాకు అన్నదానం చేస్తే అదృష్టం వస్తుందని స్థానికులు నమ్మారు. ఆయన ఏం మాట్లాడినా అది నిజమేనని, అందుకే ఆయనపై ప్రజల్లో గౌరవం ఉందని స్థానికుడు ఒకరు తెలిపారు.