1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన పవర్ స్టార్ పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ఖరీదైన, లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఆయనకు ఆస్తలు ఉన్నాయి. నగర శివారు ప్రాంతంలో ఓ ఫాంహౌజ్ కూడా ఉంది. ఇపుడు మరో ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. 
 
హైదరాబాద్ ఖాజాగూడలోని ప్రధాన ఏరియాలో 1200 చదరపుగజాల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న ధరల ప్రకారం చూస్తే ఒక చదరపు గజం స్థలం రూ.2 లక్షలకు పైగానే ఉన్నట్టు సమాచారం. ఆ ప్రకారంగా 1200 చదరపు గజాల ఫ్లాట్ విలువ రూ.24 కోట్ల మేరకు ఉన్నట్టు తెలుస్తుంది. 
 
కాగా, ఇటీవల "భీమ్లా నాయక్" చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఇపుడు వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" అనే సినిమాను సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలను కూడా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అప్పగించినట్టు తెలుస్తుంది.