మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (13:27 IST)

బాలీవుడ్‌లో "భీమ్లా నాయక్" రచ్చ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలు హీరో విలన్లుగా నటించిన చిత్రం "భీమ్లా నాయక్". గత నెల 25వ తేదీన తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నిత్యామీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ  చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లేను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమకూర్చారు. థమన్ సంగీతం. 
 
అయితే, ఈ చిత్రాన్ని హిందీలో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయనున్నారు. ఇందులోభాగంగా, శుక్రవారం హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. "అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం" అంటూ తెలుగు టైటిల్స్ ప్రదర్సించారు. ఒకపుడు ఇంగ్లీష్ చిత్రాలకు తెలుగు టైటిల్స్ వేసేవారు. ఇపుడు హిందీ చిత్రాలకు కూడా తెలుగు టైటిల్స్ వేస్తున్నారు. ఈ ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్, రానా దగ్గుబాటి చెప్పే డైలాగులతో కట్ చేశారు.