బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (13:57 IST)

'భీమ్లా నాయక్‌'పై పోలీసులకు ఫిర్యాదు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన మల్టీస్టారర్ చిత్రం "భీమ్లా నాయక్". సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 25వ తేదీన విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై ఒక పోలీస్ కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ పురుషోత్తం ఈ ఫిర్యాదు చేశారు. 
 
ఈ సినిమాలో సారెను కాలితో తన్నే సన్నివేశంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల ఈ అభ్యంతరకర సన్నివేశాన్ని తొలగించి, చర్యలు తీసుకోవాలని పురుషోత్తం తెలంగాణ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.