గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (12:57 IST)

చిరంజీవితో విబేధాలకు కుట్ర.. కేసీఆర్, కేటీఆర్ అలా చేయలేదుగా?!

మెగాస్టార్ చిరంజీవికి తమకు మధ్య విబేధాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతుందని మెగా బ్రదర్ నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మిమ్మల్ని విబేధించారు కాబట్టే పవన్‌ను టార్గెట్ చేశారా ? మీతో కలవలేదు కాబట్టే మహేశ్ బాబును కార్నర్ చేస్తారా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వానికి మంత్రులకు సినిమా వాళ్ళ ఆపరేషన్స్ గురించి తెలియదన్నారు మెగా బ్రదర్. 
 
సీఎం జగన్ మంచిగా పాలిస్తే తాము సంతోషిస్తామన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై తాము విమర్శలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అయినా.. తమకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. కానీ ఏపీలో చిరుకు తమకు మధ్య విమర్శలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని నాగబాబు సెన్సేషనల్ కామెంట్లు చేశారు.