గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (17:06 IST)

రాజ్యాంగాన్ని మార్చడానికి నువ్వెవడు మిస్టర్ కేసీఆర్ : భట్టి విక్రమార్క

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సారథ్యంలోని రచనా కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని మార్చడానికి సీఎం కేసీఆర్ ఎవరు అని తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మహిళలను బానిసలుగా చూస్తున్న సమయంలో వారికి హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ అంబేద్కర్‌ది అని ఆయన అన్నారు. 
 
ఆస్తిలో హక్కులు కల్పించి లింగ వివక్ష లేకుండా చేసిన రాజ్యాంగాన్ని మార్చడానికి కేసీఆర్ ఎవడు అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందరికీ సమానమైన హక్కులు, వాక్ స్వాతంత్ర్యం, భావ స్వేచ్ఛ కల్పించినందుకు రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నావా? అని ఆయన నిలదీశారు.