గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (16:54 IST)

సినిమాను అడ్డుపెట్టుకుని పార్టీని నిలబెట్టుకోవాలని పవన్ రాజకీయం : ఆర్కే.రోజా

సినిమాను అడ్డుపెట్టుకుని పార్టీని నిలబెట్టుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే.రోజా అన్నారు. పవన్ నటించిన "భీమ్లా నాయక్" చిత్రాన్ని కలెక్షన్ల పరంగా దెబ్బతీయడానికి ఏపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా అనేక అడ్డంకులు సృష్టిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. 
 
పవన్ కళ్యాణ్‌ను తొక్కేయాలని మేమెందుకు చూస్తాం. అయినా ఆయన నిర్మాతనా లేక పంపిణీదారుడా అంటూ ప్రశ్నించారు. టిక్కెట్ ధరల నిర్ణయం ఒక కొలిక్కి వస్తుందనుకునే సమయంలోనే మంత్రి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందారని, ఈ కారణంగా టిక్కెట్ల పంచాయతీ తేలలేదన్నారు. ఈ లోగా భీమ్లా నాయక్ చిత్రం విడుదలైందని ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి టిక్కెట్ల ధర సమస్య కొలిక్కి వచ్చేంత వరకు సినిమాను విడుదల చేయకుండా ఆపుకోవాల్సిందంటూ ఆమె హితవు పలికారు.