హిజాబ్ ఇష్యూ..పాక్‌కు ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్.. ఆ అమ్మాయి ప్రధాని అవుతుంది..?
హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. హిజాబ్ ధరించి విద్యార్ధినిలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లకూడాదా? అని ప్రశ్నించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈరోజు హిజాబ్ ధరించిన అమ్మాయి ఏదోక రోజు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుంది"అని అన్నారు.
"హిజాబ్, నిఖాబ్ ధరించిన మహిళలు కాలేజీలకు వెళ్తారు. జిల్లా కలెక్టర్లు అవుతారు. న్యాయమూర్తులు అవుతారు.డాక్టర్లు,వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తారని ఓవైసీ వెల్లడించారు.
ఇంకా ఓవైసీ మాట్లాడుతూ.. "హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది.. కావాలంటే నేను చెప్పింది రాసి పెట్టుకోండి. ఇది చూడటానికి నేను జీవించి ఉండకపోవచ్చు.. కానీ ఏదోక రోజు ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది" అని అన్నారు.
హిజాబ్ వివాదంపై పాక్ మంత్రులు విమర్శలకు "ఇది మా దేశం అంతర్గత సమస్య మేం చూసుకుంటాం..మీ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. బాలికా విద్య కోసం పోరాడే మలాలా యూసఫ్ జాయ్పై తాలిబన్లు దాడి చేసింది పాకిస్థాన్‌లోనే కదా.. అటువంటి మీరు మాకు నీతులు చెప్పనక్కరలేదు" అని పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఓవైసీ.