శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఒక్క రోజులో రూ.57 వేల కోట్లు నష్టపోయిన అదానీ గ్రూపు

Adani
భారత స్టాక్ మార్కెట్‌ ట్రేడింగ్‌లో చోటుచేసుకున్న హెచ్చుతగ్గుల కారణంగా అదానీ గ్రూపు తీవ్రంగా నష్టపోయింది. కేవలం ఒకే ఒక్క రోజులో ఈ కంపెనీ రూ.56 వేల కోట్లను కోల్పోయింది. దీంతో ఆ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి దిగజారారు. ఈ జాబితాలో ఆయన ఇటీవలే రెండో స్థానానికి చేరుకున్న విషయం తెల్సిందే. ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉండగా, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. 
 
గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ప్రతికూల ధోరణలు కనిపిస్తున్నాయి. ఇది అదానీ గ్రూపు షేర్లపై తీవ్ర ప్రభావం చూపించసాగాయి. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి అదానీ గ్రూపు ఏకంగా రూ.57 వేల కోట్ల మేరకు నష్టపోయింది. ఫలితంగా బ్లూంబెర్గ్ ఇండెక్స‌లో గౌతం అదానీ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారారు. రెండో స్థానంలోకి అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఎగబాకారు. 
 
ప్రస్తుతం బెజోస్ నికర సంపద 138 బిలియన్ డాలర్లు కాగా, గౌతం అదానీ సంపద 135 బిలియ్ డాలర్లుగా ఉందని బ్లూంబర్గ్ వెల్లడించింది. అదేసమయంలో ఈ జాబితాలో 245 బిలియన్ డాలర్ల నికర సంపదతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 82.4 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో నిలిచారు.