1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Kanna Lakshmi Narayana as BJP State president

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కన్నా నియామకం.. (వీడియో)

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా శ్రమించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎన్నికల కమిటీ కన్

Kanna Lakshmi Narayana
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా శ్రమించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా ఎంపిక చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఆదివారం దీనిపై అధికారికంగా ప్రకటన జారీచేశారు. వెరసి... దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరదించారు.
 
పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న వైజాగ్ ఎంపీ కంభంపాటి హరిబాబు రాజీనామా తర్వాత... అధ్యక్ష పదవి కోసం అనేక పేర్లు పరిశీలనకు వచ్చాయి. బలమైన నాయకుడి కోసం జల్లెడ పట్టగా... కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి, పైడికొండల మాణిక్యాలరావు ముందు వరుసలో నిలిచారు. 
 
ఒక్కొక్కొరితో పార్టీకి కలిగే ప్రయోజనాలను బేరీజు వేసుకోవడంతోపాటు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని... సోము వీర్రాజు, కన్నా పేర్లు తుది జాబితాలో నిలిచాయి. చివరికి... అధ్యక్ష పదవి కన్నా లక్ష్మీనారాయణను వరించింది. రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికల కమిటీ కన్వీనర్‌ పదవిని ఏర్పాటు చేసి... దానిని సోము వీర్రాజుకు అప్పగించారు. 

 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బీహార్‌‌లో పోటీ పరీక్షలు-స్లీవ్ లెస్ డ్రస్సులు వేసుకోలేదని కత్తిరించేశారు..