స్వామి నువ్వు గెలిపిస్తావు.. నాకు తెలుసు: శ్రీవారిని ప్రార్థించిన అమిత్ షా
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కర్ణాటక ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపి, ఇంకో వైపు జెడిఎస్ ఇలా మూడు ప్రధానపార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగించాయి ముగించేశాయి కూడా. గతంలో ఉన్న ఎన్నికల కన్నా ఈ ఎన్నికలను రెండు జాత
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కర్ణాటక ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపి, ఇంకో వైపు జెడిఎస్ ఇలా మూడు ప్రధానపార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగించాయి ముగించేశాయి కూడా. గతంలో ఉన్న ఎన్నికల కన్నా ఈ ఎన్నికలను రెండు జాతీయ పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. అందుకే ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపికి చెందిన అగ్రనేతలందరూ ప్రచారంలో బిజీగా గడిపారు. నిన్నటితో ప్రచారం ముగిసిన వెంటనే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతికి చేరుకున్నారు.
తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమిత్ షాకు టిటిడి ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. దర్శనం తరువాత బయటకు వచ్చిన అమిత్ షా మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ హయాంలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతి, అక్రమాలే తమను కర్ణాటక ఎన్నికల్లో గెలిపిస్తాయని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులతో గెలిచి తీరుతామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.