ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 మే 2018 (10:56 IST)

పురావస్తు శాఖ పరిధిలోకి శ్రీవారి ఆలయం... వెనక్కి తగ్గిన కేంద్రం

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ సంకల్పించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై తితిదే ఈవోకు పురావస్తు శాఖ ఒక లేఖ పంపించింది.

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ సంకల్పించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై తితిదే ఈవోకు పురావస్తు శాఖ ఒక లేఖ పంపించింది. శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న అన్ని ఆలయాలను తమకు అప్పగించాలంటూ ఆ లేఖ సారాంశం. అలాగే, తమ శాఖ సిబ్బంది వచ్చినపుడు తితిదే అధికారులు పూర్తిగా సహకరించాలంటూ అందులో పేర్కొంది.
 
అయితే, తితిదేకు కేంద్ర పురావస్తు శాఖ రాసిన లేఖ వ్యవహారం మీడియాకు లీకైన కొన్ని నిమిషాల్లోనే తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పురావస్తు శాఖ… లేఖపై వెనక్కి తగ్గింది. సమాచార లోపంతోనే ఈ లెటర్ పంపామంటూ వివరణ ఇచ్చుకుంది. వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని స్పష్టంచేసింది. దీనికి సంబంధించి టీటీడీ ఈవోకు మరో లేఖ పంపింది.